చరిత్ర సృష్టించిన సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డును సానియా మీర్జా కైవసం చేసుకుంది. ఆసియా/ ఓషియానియా జోన్ నుంచి సానియా ఈ అవార్డుకు ఎంపికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత టెన్నిస్ క్రీడాకారిణిగా రికార్డుపుటల్లోకెక్కింది. మే 1 నుంచి వారం రోజుల పాటు జరిగిన ఆన్లైన్ ఓటింగ్‌లో 16,985 మంది పాల్గొనగా 10 వేల పైచిలుకు ఓట్లతో ఆసియా పసిఫిక్ జోన్లో ఉన్న సానియా విజేతగా నిలిచింది. విజేతకు దక్కే రూ.1.5 లక్షలను నగదును ఆమె తెలంగాణ సిఎం సహాయ నిధికి పంపించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఫెడ్‌కప్‌లో పునరాగమనం చేసిన సానియా భారత్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చడంతో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అవార్డు గెల్చుకోవడం పట్ల సానియా స్పందిస్తూ దేశంతో పాటు అభిమానులకు ఈ అవార్డును అంకితమిస్తున్నా నాకు ఓటేసిన వారందరికీ కృతజ్ఞతలు.. భవిష్యత్తులో దేశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానని ఆశిస్తున్నానని సానియా పేర్కొంది.













