‘ఇండియా అతి వేగంగా పురోగమిస్తోంది. అందులో ఎన్అర్ఐ ల పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనది’ శాన్ఫ్రాన్కిస్కో కొత్త కాన్సల్ జనరల్ శ్రీకర్ రెడ్డి
శాన్ ఫ్రాన్సిస్కో నూతన కాన్సల్ జనరల్‌గా నియమితులైన డాక్టర్ శ్రీకర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలుకుతూ, మిల్ పిటాస్ లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్ విజయవంతమైంది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిల్ పిటాస్, శాన్ హోసె, ఫ్రీమాంట్ ఇతర నగరాలకు చెందిన మేయర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, భారతీయ ప్రముఖులు, ఎఐఎలోని భారతీయ సంఘాల ప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాన్సల్ జనరల్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఎఐఎ ప్రముఖులు రాజ్ భానోత్, జయరామ్ కోమటి, జీవన్ జుక్షితోపాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత సన్నివేల్ టెంపుల్‌కు చెందిన వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ డాక్టర్ శ్రీకర్ రెడ్డిని, ఆయన సతీమణి ప్రతిమను వేదిక వద్దకు స్వాగతించారు.
డా. రమేష్ కొండ తొలుత నగరాల మేయర్లను, ఇతర ప్రముఖులను కాన్సల్ జనరల్‌కు పరిచయం చేశారు.
ఈ సందర్భంగా కాన్సల్ జనరల్ శ్రీ శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ 3 రోజులలో ఇంతమందితో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ ( ఏఐఏ) వారు రిసెప్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఈ ఏర్పాట్లు చేసిన డా. రమేష్ కొండ, విజయ ఆసూరిలకు తమ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం గర్వపడేలా చంద్రయాన్, చంద్రుడిపై దిగిన ఆగస్టు 23వ తేదీన మీ అందరిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ 1947లో స్వాతంత్య్రం వచ్చిన భారతదేశం 2047కి ప్రపంచంలోని అగ్రదేశాలతో ఒకటిగా నిలవాలి, అందుకు అందరూ తోడ్పడాలని, 75 సంవత్సరాల తరువాత వచ్చిన 25 సంవత్సరాలని అమృత్ కాల్ అంటారని, మనం ఆ అమృత కాలంలో ఉన్నామని తెలిపారు. అప్పటికి భారతదేశం 35 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుందని ఆశిస్తున్నామన్నారు. కాన్సుల్ జనరల్ గా తాను భారతీయుల సమస్యలు అన్నింటికి పరిష్కరించటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికా ఎగుమతి చేస్తున్న బిజినెస్ ఇండియా నుంచి పెద్దదిగానే ఉంది. అయితే అమెరికా దేశం భారత దేశం నుంచి చేసుకునే దిగుమతి కేవలం 2 శాతం ఉందని దానిని 10 శాతం చేయాలని ఒక లక్ష్యంతో భారతదేశం పని చేస్తోందని చెప్పారు.
గత సంవత్సరం ఇండో ఫసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పరిటీని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రారంభించారని, ఈ సంవత్సరం నవంబర్‌లో జరిగే మీటింగ్‌లో దీనికి ఒక రూపం వస్తుందని, ఆ తరువాత తప్పనిసరిగా అమెరికా, ఇండియా మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి అన్నారు. అదే విధంగా అమెరికా ఇండియా నుంచి దిగుమతి చేసుకోవటానికి సెమికండక్టర్, చిప్స్ లాంటి ఉన్నాయని కాలిఫోర్నియా రాష్ట్రం ఆ దిగుమతి చేసుకొనే కంపెనీలకు నిలయం అని అన్నారు.
అలాగే ఎన్ఆర్ఐలు చేస్తున్న సేవలు చాలా బాగున్నాయని గత సంవత్సరం 26 బిలియన్ డాలర్లను ఎన్ఆర్ఐలు ఇండియాకు పంపించారని ఇందుకు అందరిని మనస్ఫూర్తిగా అభినందించాలి అన్నారు. ఇండియా పురోభివృద్ధి లో ఎన్ ఆర్ ఐ ల పాత్ర కూడా ముఖ్యమైనది అని అన్నారు.
అలాగే సాంస్కృతిక, విద్య ఇతర రంగాల్లో కూడా అభివృద్ధికి, ప్రోత్సాహానికి తనవంతుగా అందరికీ సహాయపడుతూ ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఐఎకు చెందిన పలు అసోసియేషన్లతో కాన్సల్ జనరల్ ఫోటోలను దిగారు. వారి అభినందనలను అందుకున్నారు. మీడియా వాళ్ళు కూడా కాన్సల్ జనరల్ ను అభినందిస్తూ, ఫోటోలను దిగారు. చివరన రాజ్ దేశాయ్ వందన సమర్పణ చేశారు.
కాన్సల్ జనరల్‌తో ‘తెలుగు టైమ్స్’ కొత్తగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శ్రీకర్ రెడ్డికి ‘తెలుగు టైమ్స్’ అభినందనలు తెలియజేసింది. తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు ఈ కార్యక్రమానికి హాజరై ఆయనను కలుసుకుని తెలుగు టైమ్స్ పత్రికను అందజేసి పత్రిక వివరాలను తెలియచేశారు.
పాల్గొన్న అసోసియేషన్లు
American Organization for Development of Bihar (AODB)
Asha Jyothi Organization
BATA – Bay Area Telugu Association
BATM – Bay Area Tamil Manram
Bay Malayali, Bihar Association
Dance Karishma
Federation of Malayalee Associations of Americas
Gujarati Cultural Association (GCA)
GOPIO (Global Organization of the People of Indian Origin)
ILP (India Literacy Project)
Indo American Society of Bay Area
IACF – Indo-American Community Federation
KKNC (kannada Koota of Northern California)
KTF Kashmiri Task Force
OSA (California Chapter)
Paatasala (Telugu School)
PCA (Punjabi Cultural Association)
SEF (Sankara Eye Foundation)
Sewa International
Spandana organization
TANA (Telugu Association of North America)
TCA (Telangana Cultural Association)
Hindu Temple & Cultural Centre (livermore Shiva Vishnu Temple)













