అమెరికా యుద్ధనౌకలో అగ్ని ప్రమాదం
కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో నావికాస్థావరంలో నిలిపి ఉన్న అమెరికా యుద్ధ నౌకలో పేలుడు సంభవించడంతో 21 మందికి గాయాలయ్యాయని సైనిక అధికారులు తెలిపారు. యూఎస్ఎస్ బోన్హోమ్ రిచర్డ్‌లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించిందని అన్నారు. పేలుడు దాటికి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని మిలటరీ అధికారులు తెలిపారు. ఆ సమయంలో నౌకలో 160 మంది సిబ్బంది. అధికారులు నౌకలో ఉన్నారని చెప్పారు. దట్టమైన పొగలు కమ్ముకున్నాయనీ, గాయపడిన 17 మందిని ఆస్పత్రికి తరలించినట్టు అధికార ప్రతినిధి మైక్రానీ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని అన్నారు.













