లెవెల్ అప్ ను ప్రారంభించిన సెయింట్ లూయిస్ యూనివర్సిటీ
అమెరికాకు చెందిన సెయింట్ లూయిస్ యూనివర్సిటీ తమ విద్యార్థుల కోసం లెవల్ అప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమెరికా జాబ్ మార్కెట్లో ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్దులను తీసుకునేందుకు కంపెనీలు వెనుకాడుతున్నాయని, దీన్ని అధిగమించి విద్యార్థులకు ఉద్యోగ అనుభవ అవకాశాలకు హామీ ఇచ్చే కెరీర్ ఆధారిత కార్యక్రమం లెవెల్ అప్ అని యూనివర్శిటీ తెలిపింది. హైదరాబాద్, ముంబైలో యూనివర్సిటీ లెవెల్ ఆప్ గురించి ప్రకటించింది. ఈ కార్యక్రమం విద్యార్థులకు వృత్తిపరమైన విజయం కోసం ఒక రోడ్ మ్యాప్‌ను అందిస్తుందని ఇంటర్నేషనల్ ఎన్రోల్మెంట్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ లుచెన్ లీ తెలిపారు. లెవెల్ ఆప్ కార్యక్రమం పూర్తయిన తరువాత పని అనుభవం హామీ పొందుతారని తెలిపారు.













