అధ్యక్ష ఎన్నికలో రష్యా ప్రమేయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్న 13 మంది రష్యన్లపై నేరారోపణ కేసును నమోదు చేశారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ తరపున రష్యన్లు ప్రచారం నిర్వహించినట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. 13 మంది రష్యన్లతో పాటు మరో మూడు రష్యా కంపెనీలు కూడా అమెరికా ఎన్నికల్లో ప్రమేయం ఉన్నట్లు ఆ దేశ న్యాయశాఖ సృష్టం చేసింది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి కూడా ట్రంప్ అనుకూల ప్రచారం జరిగినట్లు న్యాయశాఖ పేర్కొన్నది. అమెరికా పౌరుల గుర్తింపులను చోరీ చేసి, రాజకీయ కార్యకర్తలుగా రష్యన్లు, హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని తేల్చారు. అమెరికా ఎన్నికల్లో రష్యా ప్రేమయం ఉందన్న అంశంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. రాబర్ట్ ముల్లర్ బృందం ఈ కేసులో నేరారోపణలు చేసింది.













