జీ 7 నుంచి మేం బయటకు పోలేదు!

జీ7 దేశాల కూటమి నుండి రష్యా ఎన్నడూ వైదొలగలేదని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సృష్టం చేశారు. ఎస్సిఓ సదస్సుకు హాజరైనప పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీ7 ఇప్పుడు మరింత బలోపేతమైందన్నారు. రష్యా వరకూ జీ7 కూటమికి తిరిగి రావటమన్న అంశం వర్తించబోదని, తాము ఈ సంస్థ నుండి ఇప్పటి వరకూ బయటకు వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. ఒకప్పుడు రష్యా రావాంటేనే విముఖత వ్యక్తం చేసిన మిత్రులు ఇప్పుడు రష్యాకు వస్తుండటం తమకు సంతోషం కలిగిస్తోందని ఆయన అన్నారు. అమెరికా వాణిజ్య విధానాలు, తదితర అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మిత్రదేశాల మధ్య తీవ్ర విభేదాలతో జీ7 శిఖరాగ్ర సదస్సు ముగిసిన కొద్దిసేపటికే ఎస్సిఓ సదస్సుకు కూడా ముగిసింది. సదస్సు ముగిసిన అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేయటానికి ట్రంప్ విముఖత వ్యక్తం చేశారు.











































































