NATS: నాట్స్ సంబరాల్లో హైలైట్‌గా సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్
నాట్స్ (NATS) సంబరాల్లో హైలైట్‌గా సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devisri) ఈ సంబరాల్లో సంగీత విభావరి చేయనున్నారు. ఆయన సంగీతం సమకూర్చిన పాటలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. సినీ సంగీత ప్రపంచంలో దేవిశ్రీ ప్రసాద్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ.. మారుతున్న ప్రతి జనరేషన్లోనూ మ్యూజిక్ డైరెక్టర్‌గా అగ్ర స్థానంలోనే ఉంటున్నారు. సంగీత దర్శకునిగా పాతికేళ్ల కెరీర్ పూర్తి చేసుకుని నేటికి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌లలో ఒకరిగా ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ తెలుగులో, తమిళంలో ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి అభిమానుల ఆదరణను సంపాదించుకున్నాడు. అలాంటి దేవిశ్రీ ప్రసాద్ నాట్స్ సంబరాలులో తన మ్యూజిక్ తో మెరుపులు కురిపించనున్నారు. ఆయనతోపాటు రంజిత్, సాగర్, రీటా, శుభ కూడా ఈ సంగీత విభావరిలో పాలుపంచుకోనున్నారు.







