పిజ్జాలు చేసే రోబోలు వచ్చేశాయి!
పిజ్జాలు చేసే రోబోలు వచ్చేశాయి. విభిన్న సైజులు, రుచులతో కూడిన పిజ్జాలను గంటకు ఏకంగా 150 దాకా చకచకా సిద్ధం చేస్తాయి. అమెరికాలో పిజ్జాలకు ఫేమస్ అయిన జుమ్ సంస్థ ఇప్పటికే రోబోలతో పిజ్జాలను తయారు చేయిస్తోంది. ఈ మేరకు ఎస్వోఎస్వీ/హెచ్ఏక్స్ కంపెనీ నుంచి ఒక్కోటి 25 వేల నుంచి 30 వేల డాలర్ల చొప్పున కొన్ని రోబోలను కొనుగోలు చేసింది. రోబోల ద్వారా సిబ్బందికి అయ్యే ఖర్చులతో సగమే అవుతుందని, నిర్వహణ ఖర్చూ తక్కువేనని జుమ్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో రోబోల ద్వారా చేయించడం ఎంతో సురక్షితం అన్న అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా రోబోలు కావాలంటే ఎస్వోఎస్వీ/హెచ్ఏక్స్ కంపెనీకి ఇప్పటికే 400 ఆర్డర్లు వచ్చాయి.













