భారత కాక్ సహాధ్యక్షులుగా రో ఖన్నా, మైక్ వాల్ట్జ్ ఎన్నిక
అమెరికాలోని ప్రస్తుత 118వ కాంగ్రెస్ సభలో భారత్తో పాటు ఇండో అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన కాకస్ సహాధ్యక్షులుగా (కో- చైర్స్) ఇండో అమెరికన్ అయిన డెమోక్రటిక్ సభ్యుడు రో ఖన్నా (46), రిపబ్లిక్ హౌస్ సభ్యుడు మైక్ వాల్ట్జ్ ఎన్నికయ్యారు. ఈ కాకస్ అమెరికా ప్రతినిధుల సభలో చట్టసభ సభ్యుల అతిపెద్ద ద్వైపాక్షిక కూటమి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ఇది కృషి చేస్తుంది. 1993లో మొదటిసారిగా ఏర్పడిన ఈ కాకస్కు ఇప్పటిదాకా సహాధ్యక్షుడిగా ఎన్నికైన రెండో ఇండో అమెరికన్ రో ఖన్నా. 115వ కాంగ్రెస్ సభలో (2015-160 ఇండో అమెరికన్ అమీ బేరా ఈ కాకస్కు సహాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సభలో అయిదుగురు ఇండో అమెరికన్లు ఉన్నారు.













