చైనా కాదు.. భారత్ మా మిత్ర దేశం : అమెరికా
భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి రేటెల్లర్సన్ పిలుపునిచ్చారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా కంటే భారత్ మాత్రమే అమెరికాకు నమ్మకమైన మిత్ర దేశామని ఆయన అన్నారు. చైనా స్వార్థబుద్ధితో మాత్రమే అమెరికాతో స్నేహం చేస్తుందని ఆరోపించారు. బాధ్యత గల భారత్ వంటి దేశాలతో వ్యాపార సంబంధలను కూడా మెరుగుపరుచుకుంటే రెండు దేశాలకు మేలు జరుగుతుందని అన్నారు. అమెరికాలో భారతప్రధానికి అపూర్వ స్వాగతం లభించిందని ట్రంప్ మరే దేశాధినేతకు ఇవ్వని గౌరవాన్ని మోడీ పట్ల చూపారని అన్నారు. చైనా దక్షిణసముద్రంలో అమెరికా సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని విమర్శించారు. చైనాతో సంబంధాలకు ఇది ప్రధాన అవరోధంగా మారుతోందన్నారు. అలాగే ఇటు భారత్తో కూడా చైనాకు మంచి సంబంధాలు లేవని ఇటీవల డోక్లామ్ వివాదంతో ఇరు దేశాల మధ్య దూరం పెరిగిందన్నారు.













