హెచ్ -4 వీసా అనుమతులు రద్దు?
హెచ్-4 వీసాదారులు ఉద్యోగాలు చేసుకోవడానికి ఉన్న అనుమతులను రద్దు చేయడానికి ఉద్దేశించిన విధాన ప్రక్రియ తుది దశలో ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఓ ఫెడరల్ కోర్టుకు తెలిపింది. హెచ్-4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను రద్దు చేసే ప్రతిపాదన ప్రస్తుతం హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) వద్ద ఉందనీ, డీహెచ్ఎస్ ఆమోదం పొందాక దీనిని మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్కు పంపుతామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. అనంతరం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఈ నిబంధనను అమల్లోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తారంది.













