వైట్ హౌస్ అధికార ప్రతినిధికి అవమానం
అమెరికాలోని ఓ రెస్టారెంట్లో వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్‌కు ఘోర అవమానం జరిగింది. ట్రంప్ దగ్గర పనిచేస్తున్న ఒకే ఒక్క కారణంతో రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లిపోవాలని రెస్టారెంట్ నిర్వాహకులు కోరారు. దీంతో సారా మనస్తాపం చెంది మారు మాట్లాడకుండా అక్కడనుంచి వెనుదిరిగారు. ఈ విషయాన్ని అమె ట్విటర్లో పేర్కొన్నారు. వర్జీనియాలోని లెగ్జింటన్ ప్రాంతంలో ఉన్న రెడ్ హెస్ రెస్టారెంట్ యజమానురాలు నన్ను ఆ హోటల్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. నేను శ్వేతసౌధంలో పనిచేయడమకే ఇందుకు కారణం. ఏం మాట్లాడకుండా నేను అక్కడి నుంచి వచ్చేశాను. నన్ను విమర్శించిన వ్యక్తులతోనూ నేను కలుపుగోలుగా ఉంటాను. నా సామర్థ్యం మేరకు నేను ప్రజలందరినీ గౌరవిస్తాను. వాళ్ల నాకు మర్యాద ఇవ్వకపోయినా, నేను మాత్రం అలాగే ఉంటాను అని ట్వీట్ చేశారు.













