కిమ్ అనారోగ్యంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వదంతులుగా కొట్టేశారు. పాత వైద్య నివేదికల ఆధారంగా కిమ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారంటూ సీఎన్ఎన్ చానెల్ కథనం ఇచ్చిందన్నారు. అయితే, కిమ్ క్షేమంగా ఉన్నారన్న సమాచారం మీ వద్ద ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ •వాబివ్వలేదు. ఆయనేమీ ఇబ్బందులో లేరని భావిస్తున్నా అని మాత్రం పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంతలా దెబ్బతినడానికి కారణమైన చైనా మూల్యం చెల్లించక తప్పదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో హెచ్చరించారు.













