వ్యక్తిగత అవసరాల కోసం ఇలాంటి ప్రచారం : ఇమ్రాన్
ఇస్లాంను, ఉగ్రవాదాన్ని ఒకటిగా చూసే ప్రయత్నాలను మానుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇలాంటి ప్రచారం చేయడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. విద్వేష పూరిత ప్రసంగాలను అడ్డుకోవడం అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అమెరికాలో 9/11 ఉగ్రదాడులు జరగడానికి ముందు మతానికి, ఉగ్రవాదానికి ముడిపెట్టి మాట్లాడేవారే కాదని చెప్పారు. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ తమిళ టైగర్స్‌లో 75 శాతం మంది హిందువులు ఉండేవారని అయితే ఆ సమయంలో ఎవరూ మత ప్రస్తావన తీసుకురాలేదని గుర్తు చేశారు. ఈ సమావేశంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ పాల్గొన్నారు.













