పాక్ నిర్ణయంపై ఐరాస హర్షం
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను విడుదల చేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించడంపై ఐక్యరాజ్య సమితి హర్షం వ్యక్తం చేసింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ ప్రభుత్వం భారత పైలట్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం ఆహ్వానించదగిన నిర్ణయం అని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజెర్రిక్ పేర్కొన్నట్టు డాన్ పత్రిక వెల్లడించింది. ఉద్రిక్తలు తగ్గించేందుకే ఏం చేయగలరో అది చేసేందుకు ఇరు పార్టీలను మేము ప్రోత్సహిస్తాం. ఐరాస, అంతర్జాతీయ సమాజం కోరుకునేది కూడా ఇదే అని స్టీఫెన్ పేర్కొన్నారు.













