అమెరికాలో మరో తెలుగు టెకీకి జైలు శిక్ష
అమెరికాలో ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం పేరుతో విద్యార్థులకు అక్రమంగా వీసాలిచ్చిన కేసులో మరో తెలుగు టెకీ ఫణిదీప్ కర్నాటికి 6 నెలల జైలు శిక్ష పడింది. శిక్ష అనుభవించాక అతడిని భారత్కు తిప్పి పంపుతామని హోంల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తు అధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే పలువురు తెలుగు విద్యార్థులు, టెకీలకు జైలు శిక్ష పడింది. వారిలో భారత్ కాకిరెడ్డి (16 నెలల ఖైదు), సురేశ్ కందల (18 నెలలు), ప్రేమ రంపీస( ఏడాది), సంతోష్ సామ (రెండేళ్లు), అవినాశ్ తక్కలపల్లి (15 నెలలు), అశ్వంత్ నూనె (ఏడాది), నవీన్ ప్రతిపాటి (ఏడాది జైలు శిక్ష) ఉన్నారు.













