ఎన్ఆర్ఐ హాస్పటల్ కు పీపీఈ కిట్లు పంపిణీ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు టీడిపి నాయకులు, అభిమానులు చేపట్టారు. ఏపీఎన్ఆర్టీ మాజీ అధ్యక్షులు రవి వేమూరి, బుచ్చిరాంప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ హాస్పటల్ కు, విజయవాడలోని జిజిహెచ్, సిదార్ధ హాస్పటల్ కు కిట్లను అందించారు. డిజిపి కార్యాలయానికి 50వేల మాస్కులు పంపిణీ చేశారు. రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్‌కు వారు ఈ మాస్క్‌లను అందించారు. కరోనా మహామ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు క•షి చేస్తున్న డాక్టర్లు, పోలీసులకు తమ వంతు సాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవి వేమూరి, బుచ్చిరామ్ ప్రసాద్‌తోపాటు డా. నన్నపనేని మురళీ తదితరులు పాల్గొన్నారు.













