విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన రవి పొట్లూరి
కరోనా వైరస్ వలన తల్లితండ్రులు ఉపాధి కోల్పోయి విద్యార్థులు ఆర్ధిక ఇబ్బందులు పడుతుండటంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి తన సొంత నిధులతో, మిత్రుల ద్వారా గత మూడు నెలలలో దాదాపు వంద మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జనవరి 3వ తేదీనాడు జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ మున్సిపాలిటీకి చెందిన 9 మంది విద్యార్థులు అనిత, భవాని, ప్రవల్లిక, లక్ష్మీకాంత శెట్టి, షబ్బీర్, చంద్ర, షబానా, పరశురాముడు, రామిరెడ్డిలకు ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున 45,000 రూపాయల ఉపకారవేతనాలు మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాణిక్యం రవి, ముప్పా రాజశేఖర్, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు రత్న కుమారి, వడ్డేపల్లి సూరి, హోటల్ విజయ్, సందడి మధు తదితరులు పాల్గొన్నారు.













