రత్తయ్య జాస్తి మృతిపట్ల తెలుగు ప్రముఖుల సంతాపం
అమెరికాలో తెలుగువారికి చిరపరిచితుడైన రత్తయ్య జాస్తి 94 ఏళ్ల వయసులో న్యుమోనియా సమస్యతో మరణించారు. ఆయన మృతి పట్ల తెలుగు ప్రముఖులు, బే ఏరియా తెలుగు సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
రత్తయ్య జాస్తి ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న బోడపాడు గ్రామానికి చెందిన వారు. 1928లో జన్మించిన ఆయన మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసి బెంగళూరులోని ఐఐఎస్సీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం పిహెచ్డీ కోసం, అగ్రరాజ్యం బాటపట్టారు. మిన్నెసోటా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేశారు. అనంతరం కాలిఫోర్నియాలోని లాక్‌హీడ్ మార్టిన్‌లో ఇంజనీరుగా ఉన్నతస్థాయిలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారు.
రత్తయ్య జాస్తి మృతి పట్ల ఎన్నారై టీడిపి నాయకుడు జయరాం కోమటి ప్రగాఢ సంతాపం తెలిపారు. 40 ఏళ్లుగా ఆయనతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని పేర్కొన్నారు. రత్తయ్య జాస్తి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్టు తెలిపారు. రత్తయ్య జాస్తి మరణం పట్ల బాటా మరియు తానా కార్య వర్గాలు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాయి.













