అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రతినిధిగా రత్నాకర్
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వైఎస్ఆర్సీపి యుఎస్ఎ కన్వీనర్ రత్నాకర్‌ను నియమిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అమెరికా పర్యటన సమయంలో రత్నాకర్‌కు ఈ విషయం చెప్పారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎపి ఎన్ఆర్టీ చైర్మన్‌గా ఎన్నారై వెంకట్ మేడపాటిని జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఎన్నారై రత్నాకర్‌కు కూడా ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని ఇచ్చారు. ఈ విషయమై ఇంకా అధికారికంగా ఉత్తర్వులను ఎపి ప్రభుత్వం జారీ చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.













