Mohan Nannapaneni: మోహన్ నన్నపనేనికి రోడ్ ఐలాండ్ అరుదైన గౌరవం

ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగువారైన మోహన్ నన్నపనేనికి (Mohan Nannapaneni) అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో అరుదైన గౌరవం దక్కింది. ‘టీం ఎయిడ్’ (TEAM Aid) స్వచ్ఛంద సంస్థ ద్వారా అమెరికాలోని విదేశీయులకు ఆయన చేస్తున్న సేవను గుర్తిస్తూ రోడ్ ఐలాండ్ (Rhode Island) లెఫ్టినెంట్ గవర్నర్ సబీనా మేటోస్ (Sabina Matos) అరుదైన గుర్తింపును అందించారు. అమెరికాలో కష్టాలు ఎదుర్కొనే విదేశీయులకు టీం ఎయిడ్ ద్వారా మోహన్ నన్నపనేని (Mohan Nannapaneni) అందిస్తున్న సేవలు దయాగుణం, అంతర్జాతీయ సహకారం, మానవత్వ బాధ్యతలను ఎత్తిచూపుతాయని సబీనా మేటోస్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రోడ్ ఐలాండ్ తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ గుర్తింపు పత్రాన్ని విడుదల చేశారు. అయితే ఇది కేవలం తనకు మాత్రమే దక్కిన గౌరవం కాదని, టీం ఎయిడ్ మొత్తానికి దక్కిన అరుదైన గుర్తింపు అని మోహన్ (Mohan Nannapaneni) అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీం ఎయిడ్ (TEAM Aid) వాలంటీర్లంతా ఎంతో గొప్పగా సేవ చేస్తున్నారని కొనియాడారు. మరణించిన వారి భౌతిక దేహాలను స్వదేశాలకు చేరవేయడం, వారి కుటుంబాలకు అండగా ఉండటం, కష్టకాలంలో వారికి మార్గదర్శనం చేయడం ద్వారా టీం ఎయిడ్ ఎంతో సేవ చేస్తోందని మోహన్ (Mohan Nannapaneni) తెలియజేశారు. తనను ఇలా గౌరవించిన రోడ్ ఐలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ సబీనా మేటోస్‌కు (Sabina Matos) కృతజ్ఞతలు తెలియజేశారు.