మరో వివాదంలో అమెరికా సంగీత దర్శకుడు
అమెరికా రాక్ సంగీత దర్శకుడు కేన్ వెస్ట్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు చేసి వివాదాల్లో చిక్కుకున్న కేన్ వెస్ట్ గత ఏడాది ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారు. నెల రోజుల క్రితం తిరిగి ఖాతాను పున ప్రారంభించిన కేన్ వెస్ట్ తాజాగా మనదేశానికి చెందిన మాతా అమృతానందమయి (64)పై ట్వీట్ చేశారు. కొన్ని సార్లు మనందరికీ కౌగిలింతలు అవసరం అని తొలుత ట్వీట్ చేశారు. తదుపరి ట్వీట్లో అమ్మ మాతగా పేరొందిన అమృతానందమయి ఇప్పటి వరకు 3.2 కోట్ల మందిని కౌగిలించుకుని ఉంటారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతోపాటు ఆమె ఫోటోను కూడా షేర్ చేశారు.













