టిఎజిబి ప్రెసిడెంట్‌గా రమణ దుగ్గరాజు
బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం (టిఎజిబి) కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టిఎజిబి 2022-23 సంవత్సరానికి కొత్త ప్రెసిడెంట్‌గా రమణ దుగ్గరాజు ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా పద్మజ బాల, కల్చరల్ సెక్రటరీగా శ్రీకాంత్ గోమఠం, సెక్రటరీగా దీప్తి గోర, జాయింట్ సెక్రటరీగా ప్రశాంత్ దంద, ట్రెజరర్‌గా శ్రీనివాస్ గొంది, జాయింట్ ట్రెజరర్‌గా సుధ ముల్పూర్ ఎన్నికయ్యారు. అలాగే బోర్ట్ ట్రస్టీస్ పదవులకుగాను 2022-24 సంవత్సరానికి రవీంద్ర మేకల, అనిల్ పొట్లూరి, సీతారాం అమరవాది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు రాజా ఎస్ చిలకమర్రి ఎలక్షన్ కమిషనర్‌గా వ్యవహరించారు.













