ఫిలడెల్ఫియాలో రామాచారికి సన్మానం
స్వరార్చన, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సౌత్ జెర్సి, ఫిలడెల్ఫియా పిల్లలకు లలిత సంగీతంలో ఇచ్చిన శిక్షణ ముగియడంలో భారతీయ టెంపుల్లో జరిగిన వేడుకల్లో గురువు రామాచారిని పిల్లలు, పెద్దలు ఘనంగా సన్మానించారు. మొదటిసారిగా ఈ ప్రాంతంలో లలితసంగీతంపై శిక్షణను గురువు రామాచారి ఆధ్వర్యంలో జరిపారు. సినిమా, జానపద పాటలు, స్వరాల గుర్తింపు వంటి విషయాలతోపాటు, పాటలు పాడటంలో అవసరమైన మెళకువలను ఈ సందర్భంగా రామాచారి పిల్లలకు నేర్పించారు. శిక్షణ శిబిరం పూర్తయిన తరువాత అందరూ రామాచారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి తానా కోశాధికారి రవి పొట్లూరి, తానా ప్రాంతీయ నాయకుడు నాగరాజు నలజుల తదితరులు పాల్గొన్నారు.













