శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ .. టైమ్స్ స్క్వేర్ లో ప్రత్యక్ష ప్రసారం
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని నేరుగా తిలకించేందుకు అందరికీ సాధ్యం కాదు కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలోనూ లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో గల ప్రఖ్యాత టైమ్స్ స్కేర్‌లో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాటు కూడా పూర్తయ్యాయట. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన అనంతరం భక్తులనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దీని కూడా ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనునన్నట్లు తెలుస్తోంది.













