ఫ్రీమాంట్ లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కు మద్దతుగా బాటా, తానా నాయకుల ర్యాలీ
ఫ్రీమాంట్లో జూన్ 4వ తేదీన పోలీసుల చేతిలో మరణించిన నల్లజాతీయుడు జార్డ్ఫ్లాయిడ్ మరణానికి సంతాపం తెలుపుతూ, బ్లాక్ లైవ్స్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) నాయకులతోపాటు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. దాదాపు 500 మంది వివిధ జాతులకు చెందిన వారు, వివిధ సంఘాలవారు ఈ ర్యాలీలో పాల్గొని జాతి వివక్షను నిరసిస్తూ నల్లజాతీయులకు మద్దతుగా నినాదాలు, ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు, ఎన్నారై ప్రముఖులు జయరామ్ కోమటి, రజనీకాంత్ కాకర్ల తదితరులు పాల్గొన్నారు.













