అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017కు రాజు చింతల
అమెరికా – భారత్ సంయుక్తంగా నిర్వహించే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు 2017కు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సులో ఇండియాన తరుఫున ప్రాతినిధ్యం వహించడానికి ఇండియాన ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు రాజు చింతల ఎంపికైనట్టు తెలిసింది. అమెరికా పారిశ్రామికవేత్తలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 350 పెట్టుబడిదారులు, 1200 పారిశ్రామికవేత్తలు పాల్గొనబోతున్న ఈ సదస్సులో, ఇండియాన తరుఫున రాజుచింతల పాల్గొనబోతున్నట్టు ఇండియాన ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రకటించింది. నవంబర్ 28 నుంచి నవంబర్ 30 వరకు ఈ సదస్సు జరుగబోతుంది. మహిళలే ముందు, అన్నింటి కోసం శ్రేయస్సు అనేవి ప్రధాన హైలెట్స్‌గా ఇది జరుగుబోతుంది. ఆరోగ్యం, లైఫ్ సైన్సు, డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్, ఎనర్టీ, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్, మీడియా, ఎంటర్టైన్మెంట్వంటి రంగాలపై కూడా విస్తృతంగా చర్చించనుంది. ఇది అతిపెద్ద డీల్ అని, ఇండియాన తరుఫున ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణమని చింతల తెలిపారు.













