TANA: తానా మహాసభల్లో ‘ఎమర్జింగ్ యంగ్ లీడర్’ అవార్డు అందుకున్న రాజేష్ మహాసేన
తానా 24వ మహాసభల వేదికగా తానా (TANA) తెలుగు ఫోరమ్ తరఫున ఎమర్జింగ్ యంగ్ లీడర్స్ అవార్డును రాజేష్ మహాసేనకు అందించారు. ఈ అవార్డును మహాసభల ముఖ్యఅతిథి రఘురామకృష్ణం రాజు చేతుల మీదుగా రాజేష్ అందుకున్నారు. రాజేష్ తనకు చాలా సన్నిహితుడని, రాజకీయ రంగానికి తను చేసిన సేవ చాలా గొప్పదని రఘురామకృష్ణం రాజు చెప్పారు. ఇంత గొప్ప వేదికపై తనకు ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని రాజేష్ అన్నారు. తను ఎంతగానో అభినందించే రఘురామకృష్ణం రాజు గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం మరచిపోలేని అనుభవమని, ఈ క్షణాన్ని ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటానని రాజేష్ చెప్పారు.







