డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూఎస్ సైనిక అకాడమీలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో కుడి చేతితో మంచినీటి గ్లాస్‌ను అందుకునేందుకు ట్రంస్ సిబ్బంది పడిన వీడియో వైరల్‌గా మారింది. గ్లాస్‌ను పైకెత్తి తాగేందుకు తన ఎడమ చేతి సాయం తీసుకోవలసిన పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ట్రంప్ ఇటీవల ఆర్మీ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ప్రసంగించి మెట్లు దిగి వచ్చే సందర్భంలోనూ కుదురుగా ఉండలేక పోయారు.
రానున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల పర్యటనలతో ఆయన ఆలసటకు గురయ్యారని కొందరు చెబుతుండగా మరికొందరు మాత్రం ఆయన ఆరోగ్యం గాడి తప్పిందనే సంకేతాలు ఇవి అని అంటున్నారు. ఈ ఏడాది ట్రంప్ ఆరోగ్యంపై వార్షిక నివేదిక వెలువడకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. కాగా, ట్రంప్‌కు బ్రైన్ స్కాన్ తీయవలసిన అవసరం ఉందని ఈ లక్షణాలు వెల్లడిస్తున్నాయని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ బెండీ లీ ట్వీట్ చేశారు.













