ఏమిటా రొద… ట్రంప్ లాగా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇప్పటి దాకా ఒక్కసారైన కలవని బ్రిటన్‌రాణి ఎలిజబెత్ ఆయనపై చెణుకు విసిరారు. ట్రంప్ మాటలను హెలికాపట్టర్ల రొదతో పొల్చి తన హాస్యప్రియతాన్ని బయటపెట్టారు. ఆ కథంటంటే ఎలిజబెత్ రాణి తోటను ప్రపంచానికి పరిచయం చేసే ద క్వీన్స్ గ్రీన్ ప్లానెట్ అనే డాక్యుమెంటరీని ఒక టీవీ చానల్ తీస్తోంది. ఆ చానల్ ప్రజెంటర్‌తో కలిసి ఆవిడ ఒకరోజు బకింగ్హోమ్ ప్యాలెస్ ప్రాంగణంలోని తోటలో నడుస్తుండగా పై నుంచి హెలికాప్టర్లు వెళ్లాయి. వెంటనే ఆవిడ మాట్లాడుతున్నప్పుడు అవి ఎందుకలా ఎప్పుడూ అలా తిరుగుతూ ఉంటాయి. అధ్యక్షుడు ట్రంప్ లాగా రొద పెడతాయి? అనేశారు. ట్రంప్‌పై ఆవిడ విసిరిన ఈ చమత్కారబాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారమవుతోంది.













