యువరాజు పెళ్లికి ఎలిజబెత్ ఓకే
తన మనుమడు హారీ అమెరికా సినీనటి మోఘాన్ మార్కీని వివాహమాడేందుకు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంగీకరించారు. తన సలహాదారులతో జరిగిన సమావేశం సందర్భంగా రాణి ఎలిజబెత్-2 ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మా ప్రియతమ మనుమడు హారీ చార్లెస్ అల్బర్ట్ డేవిడ్, రేచల్ మెఘాన్ మార్కీల వివాహానికి నా సమ్మతిని ప్రకటిస్తున్నాను అని బంకింగ్ హోం ప్యాలెస్‌లో జరిగిన సమావేశంలో రాణి ఎలిజబెత్-2 ప్రకటించారు. లండన్‌లోని రాయల్ రెసిడెన్స్ అయిన విండ్సర్ క్యాస్టిల్లోని సెయింట్ జార్జి చాపెల్‌లో మే 19న హోరీ, మెఘాన్ మార్కీల వివాహం జరుగుతుంది.













