అమెరికాకు పుతిన్ ఘాటు హెచ్చరిక
ఐరోపాలో క్షిపణులు ప్రయోగిస్తే అమెరికా భావించినట్టయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్టయితే ప్రతీకార దాడులు తప్పవని అన్నారు. జాతిని ఉద్దేశించి పుతిన్ మాట్లాడుతూ 1987లో కుదుర్చుకున్న ఇంటర్మీడియేట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందానికి అమెరికా తూట్లు పొడిచిందని విమర్శించారు. ఐరోపాలో క్షిపణులు ప్రయోగించాలనే ఆలోచన ఎవరికి వచ్చినా మేం ఉపేక్షించం. క్షిపణుల ప్రయోగశాలలను గుర్తించి వాటి లక్ష్యంగా దాడులు జరపాల్పి వస్తుంది. ఈ విషయంలో వెనకడుగు ఉండదు. అందుకే, ముందుస్తుగా హెచ్చరిస్తున్నాం. మా భద్రతకు ప్రమాదం అని మేం గుర్తించినట్టయితే అధునాత క్షిపణులు ప్రయోగించాల్సి వస్తుంది అని పుతిన్ అన్నారు.













