140 నగరాలకు విస్తరించిన నిరసనలు
అమెరికాలో దాదాపు 140 నగరాల్లో ప్రజలు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. వీటిలో తీవ్రత ఎక్కువగా ఉన్న 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆవేదన, ఆగ్రహం కలగలిసిన భావంతో రోడ్లపైకి వస్తున్న ప్రజలతో వరసగా ఆరో రోజు అనేక రాష్ట్రాలు హోరెత్తిపోయాయి. అల్లుర్లలో కనీసం ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఆందోళనకారులు అరెస్టయ్యారు. అత్యధిక అరెస్టులు లాస్ఏంజెలిస్లోనే చోటు చేసుకున్నాయి. ఆ నగరంతో పాటు షికాగో, న్యూయార్క్, హ్యూస్టన్, ఫిలడెల్పియా, వాషింగ్టన్ డీసీ సహా ప్రధాన నగరాలన్నీ భగ్గుమంటున్నాయి. అరెస్టయినవారిలో న్యూయార్క్ నగర మేయర్ కుమార్తె కూడా ఉన్నారు. ఆ నగరంలో పెద్దఎత్తున నిరసనలు కొనసాగాయి. పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళిగా ప్రజలు టైమ్స్ స్క్వేర్ వద్ద కొంతసేపు మౌనం పాటించారు. కాలిఫోర్నియాలో వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి.













