అమెరికాలో కొనసాగుతున్న ఆందోళనలు
అమెరికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు అట్లాంటాలోని వెండీ రెస్టారెంటు కేంద్రంగా మారింది. ఈ హోటల్ వద్ద పోలీసుల కాల్పుల్లో మరణించిన నల్లజాతీయుడు బ్రూక్స్కు తాత్కాలిక స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు ఈ స్మారకం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. బ్రూక్స్ మృతికి కారణమైన పోలీసు గారెట్ రోల్ఫ్ను అధికారులు విధుల నుంచి తొలగించారు. మరో పోలీసు బ్రోస్నన్ను పరిపాలన విధులకు బదిలీ చేశారు. తుపాకీ బుల్లెట్ల వల్లే బ్రూక్స్ చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఫ్లాయిడ్, బ్రూక్స్ హత్యలకు నిరసనగా రిచ్మండ్లో ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని అడ్డుకునే క్రమంలో అది వారిమీదకు దూసుకెళ్లింది. కాగా, అమెరికాలో వర్ణ వివక్ష, పోలీసుల తీరుపై చర్చించాలన్న ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆమోదం తెలిపింది.













