NATS: నాట్స్ 8వ కాన్ఫరెన్స్‌లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఘనసత్కారం
గబ్బర్ సింగ్, టెంపర్, ఇద్దరమ్మాయిలతో వంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) ను నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల వేదికపై సత్కరించారు. నాట్స్‌కు చెందిన జగదీశ్ చేబ్రాల, విజయ్ కట్టా, భానుప్రసాద్ ధూళిపాళ్ల తదితరులంతా కలిసి బండ్ల గణేశ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విక్టరీ వెంకటేశ్, నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణం రాజు, కేవీ రావు, జయసుధ తదితరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నాట్స్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ.. తనను సత్కరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.







