డొనాల్డ్ ట్రంప్ నోట అదే మాట
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారత్‌తోపాటు చైనా, జపాన్ దేశాలు అధికా స్థాయిలో పన్నులు విధిస్తున్నాయని, ముఖ్యంగా ఐకానిక్ బ్రాండ్ హ్వార్లీ డేవిడ్సన్ బైకు, పేపర్ ఉత్పత్తులపై 100 శాతం పన్ను విధించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికన్ ఉత్పత్తులపై పన్నుల విధింపుల్లో భారత్ టారిఫ్ కింగ్‌గా మారిపోయిందని, దీనివల్ల గడిచిన దశాబ్ధాలుగా వందల కోట్ల డాలర్ల మేర నష్టపోయమని అమెరికాలోని విస్కాన్సిస్ రాష్ట్రం గ్రీన్ బే నగరంలో జరిగిన రిపబ్లికన్ ర్యాలీకి హాజరైన ట్రంప్ విమర్శలు గుప్పించారు.
ఒకప్పుడు అమెరికా విదేశీ పేపర్ ఉత్పత్తులపై అధిక స్థాయిలో పన్నులను విధిస్తుండేది. ప్రస్తుతం సున్న శాతానికి తగ్గించామని, కానీ విస్కన్సిన్ పేపర్ కంపెనీకి చెందిన ఉత్పత్తులను చైనా, భారత్‌లకు ఎగుమతి చేస్తే అక్కడ అధిక టారిఫ్‌లను విధిస్తున్నారని విమర్శించారు. అమెరికా ఉత్పత్తులు, అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఉండాలని ప్రజలు కోరుకుంటన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మొదట్లో హ్వీర్లీ డేవిడ్సన్ మోటర్‌సైకిళ్లపై విధించే దిగుమతి పన్నును 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం స్వాగతించింది. ఈ పన్ను విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ సూచించారు.













