అమెరికా అధ్యక్షుడు ఐర్లాండ్ పర్యటన
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కార్ ఉద్ఘాటించారు. ట్రంప్ ఐర్లాండ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సరిహద్దులో భద్రతా ప్రమాణాల పెంపు తదితర అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం భేటీకి సంబంధించిన వివరాలను వైట్‌హౌస్ కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 29 లోపు యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగాల్సి ఉంది. బ్రెగ్జిట్ అనంతరం ఏ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలనే అంశంపై సుదీర్ఘ చర్చ కొనసాగింది.













