నాకన్నా దేశభక్తుడు ఎవరూ?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. అమెరికాలో కరోనా తీవ్రత మరింత పెరిగింది. నిత్యం దాదాపు 60వేలకు పైగా కేసులు నమోదవుతూనే వున్నాయి. ఈ క్రమంలో ముఖానికి మాస్క్‌లు ధరించడాన్ని మొదట వెటకారం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మాస్క్‌లపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం వరకూ మాస్కు ధరించను అని తెగేసి చెప్పిన ట్రంప్.. ప్రస్తుతం మాస్క్‌తోనే దర్శనమిస్తున్నారు. తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడుతూ నాకన్న దేశభక్తుడు ఎవరూ లేరు అని ట్విట్ చేయడంతో పాటు, మాస్కుతో ఉన్న ఫోటోను ట్విటర్లో పోస్టు చేశారు. ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మనందరం కలిసికట్టుగా పోరాటం చేస్తున్నాం. ఈ సమయంలో భౌతికదూరం పాటించలేని సమయాల్లో ముఖానికి మాస్క్ వేసుకోవాలని చాలా మంది అంటున్నారు. కానీ, నాకన్నా ఎక్కువ దేశభక్తుడెవరూ లేరు అని తన ట్విట్లో పేర్కొన్నారు.













