ట్రంప్‌తో విందులో ముగ్గురు తెలుగువారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఇచ్చిన విందులో ముగ్గురు తెలుగువారు పాల్గొన్నారు. వారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఫిక్కీ చైర్మన్ సంగీతారెడ్డి. విందు ప్రారంభం కావడానికి ముందు అమెరికా అధ్యక్షుడికి వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి లాంఛనప్రాయంగా పరిచయం చేశారు. ఉపరాష్ట్రపతితో ట్రంప్ కరచాలనం చేసి కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు కేసీఆర్‌తో పాటు కర్ణాటక సీఎం యడియూరప్ప తదితరులు విందులో పాల్గొన్నారు. కేసీఆర్‌తో ట్రంప్ కరచాలనం చేసి కొద్దిసేపు ముచ్చటించారు.













