డాక్టర్ ప్రేమ్రెడ్డిని అభినందించిన జో బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైద్యరంగంలో అందిస్తున్న సేవలకు గాను ప్రైమ్ హెల్త్‌కేర్ అధినేత డాక్టర్ ప్రేమ్ రెడ్డిని అభినందించారు. జూన్‌లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్రెడ్డిని, డాక్టర్ కవితాభాటియాను జో బైడెన్ దంపతులు అభినందించారు. వైద్యరంగంలో ముఖ్యంగా కోవిడ్ సమయంలో ప్రైమ్ హెల్త్‌కేర్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని డాక్టర్ ప్రేమ్ రెడ్డిని జో బైడెన్ అభినందించినట్లు తెలిసింది. కాగా డాక్టర్ ప్రేమ్ రెడ్డి తెలుగువాళ్ళకు బాగా కావాల్సిన వ్యక్తి. తెలుగు కార్యక్రమాలను నిర్వహించడంలోనూ, తెలుగు సంఘాలకు సహాయ సహకారాలను అందించడంలో ముందుండే వ్యక్తి. అమెరికా జాతీయ తెలుగు సంఘం నాటా వ్యవస్థాపకుడు కూడా. తెలుగు రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి క్లాస్మేట్గా ఉన్న చొరవతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడంలో తనవంతు కృషిని డాక్టర్ ప్రేమ్ రెడ్డి చేశారు. నేటికీ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది పేదలు వైద్యసేవలను అందుకుంటున్నారు.













