ఆస్పత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు
కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్పత్రిలో చేరారు. వాషింగ్టన్ శివారు ప్రాంతం బేథెస్డాలో ఉన్న వాల్టర్ రీడ్ మిలటరీ ఆస్పత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. తనకు వైరస్ సోకినట్లు ప్రకటించినప్పటి నుంచి శ్వేతసౌధంలోనే క్వారంటైన్లో ఉన్న ఆయన వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరేందుకు అంగీకరించారు. మాస్కు ధరించి హెలికాప్టర్లో ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచే ఆయన విధులు నిర్వర్తించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరంగా ఉండే అవకావం ఉందన్నారు.













