ఆన్ లైన్ తరగతులలో ప్రారంభం కానున్న ఫ్రీమాంట్ పాఠశాలలు
భద్రతా సమస్యలను పేర్కొంటూ, ఫ్రీమాంట్ స్కూల్ బోర్డ్ జిల్లాలోని 35,000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం పాఠశాల తరగతి గదులకు దూరంగా ప్రారంభించాలని మరియు ఇంటి నుండి ఆన్లైన్లోనే విద్యార్థులకు పాఠాలు చెప్పాలని నిర్ణయించింది.
గత సంవత్సరటం ఫిబ్రవరి నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి బలవంతంగా క్యాంపస్‌లను మూసివేయడం జరిగింది. శుక్రవారం, 8 జులై తేదీ సాయంత్రం జరిగిన సమావేశం లో అల్మెడ కౌంటీలో ఏడు వరుస రోజులు ఒక్క కొత్త కోవిడ్ కేసును చూడనంతవరకు ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డు పరిధి లో వున్నా అన్ని స్కూళ్ళు లోను వర్చువల్ లెర్నింగ్‌తో తరగతులు నడపాలి అని తెలిపింది.
అయితే, రాబోయే వారాల్లో ప్రత్యేక విద్యార్థులకు , ఎవరికైతే వివిధ అభ్యాసా లు కు అవసరమో వాళ్ల కి వసతులు త్వరగా తిరిగి ఏర్పాటు చెయ్యండానికి బోర్డు పరిశీలిస్తుంది అని తెలిపింది. కొత్త కరోనా కేసు లేకుండా అల్మెడ కౌంటీలో ఏడు రోజులు గడిచినపుడు కొంత మంది విద్యార్థులను పరిమిత పద్ధతిలో తరగతి గదుల్లోకి తిరిగి అనుమతిస్తామని తెలిపింది. అదే విధం గా ఓక్లాండ్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా ఈ సంవత్సరాన్ని ఆన్లైన్ లో తరగతులు ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ వారంలో శాన్ హోసే పట్టణం లో రెండు స్కూల్ డిస్ట్రిక్ట్స్ కూడా ఆన్ లైన్ లోనే కాలాస్ లు వుంటాయని నిర్ణయించాయి.
ఫ్రీమాంట్ పాఠశాల బోర్డు సభ్యులు ఆన్ క్రాస్బీ,మిచెల్ బెర్కే మరియు డయాన్నే జోన్స్ ఈ విధంగా ఆన్ లైన్ తరగతుల ప్రారంభానికి అనుకూలంగా ఓటు వేశారు. బోర్డు అధ్యక్షుడు డెస్రీ కాంప్‌బెల్ మరియు బోర్డు సభ్యుడు లారీ స్వీనీ శుక్రవారం, 8 జులై జరిగిన ప్రత్యేక సమావేశంలో విభేదించారు. క్యాంప్‌బెల్ మరియు స్వీనీ తరగతి గదుల బోధనను ఒక అల్మెడ కౌంటీ లోని క్రోనా కేసుల లెక్క తో కట్టడి చైయటం సరి అయినా నిర్ణయం కాదు అని అన్నారు ఈ విషయం లో మాట్లాడుతూ బే ఏరియా అంతటా నివసిస్తున్న 2 వేల మంది ఉపాధ్యాయుల గురించి ఆలోచించాలని కోరారు. ‘అల్మెడ కౌంటీలో కేసులు మాత్రమే ఆధారం గా తీసుకొంటే వేరే కౌంటీ లో నివసిస్తున్న వందలాది మంది ఉద్యోగుల పరిస్థితులేంటి? ‘అని కాంప్‌బెల్ అన్నారు. “నేను నలుగురు పిల్లలతో ఒకే గదిలో ఉన్నకుటుంబాల గురించి మాట్లాడుతున్నాను, మరి ఆ తల్లి ప్రతి బిడ్డకు చదువు చెప్పే సమయం ఉండదు అలాంటి వాళ్ళ కోసం ఏదైనా అందించాలి” అని స్వీనీ చెప్పారు.
అయితే మే నెలలో ఏర్పాటు చేసిన జిల్లా పున ప్రారంభ టాస్క్‌ఫోర్స్ రూపొందించిన హైబ్రిడ్ లెర్నింగ్ కోసం ప్రణాళికలను పాఠశాల బోర్డు పరిగణించింది. టాస్క్ ఫోర్స్ విద్యార్థులు, సిబ్బంది మరియు అధ్యాపక సంఘాలు, తల్లిదండ్రులు మరియు జిల్లా పరిపాలనకు ప్రాతినిధ్యం వహిస్తున్న 50 మందితో రూపొందించబడింది. విభజన సమస్య గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహా 700 మందికి పైగా ఈ వారం ప్రారంభంలో బోర్డుకు లిఖితపూర్వక వ్యాఖ్యలను సమర్పించారు. కొంతమంది దూరవిద్యను ఎంచుకోవాలని బోర్డును కోరారు, మరికొందరు దూరవిద్య మరియు తరగతి గది బోధన యొక్క హైబ్రిడ్ విధానాన్ని అడిగారు, మరికొందరు తమ పిల్లలు వెళ్లాలా వద్దా అని ఎన్నుకోవటానికి ఆ కుటుంబాలకు వదిలివేయాలని అన్నారు. ఈ సూచనలు అన్ని పరిగణ లోకి తీసుకొని బోర్డు తమ నిర్ణయాన్ని తీలిపింది













