Prasad Thotakura: ప్రసాద్ తోటకూరకు జీవనసాఫల్య పురస్కారం

అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి, తానా తదితర సంస్థల ద్వారా సేవలందిస్తున్న ప్రసాద్ తోటకూర (Prasad Thotakura)ను 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది. హ్యూస్టన్‌లో ఆగస్టు 16, 17 తేదీల్లో వంగూరి ఫౌండేషన్, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక (Houston Telugu Cultural Association) వేదిక సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ‘పద్మ విభూషణ్’ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు తోటకూర ప్రసాద్‌కు పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో సిలికాన్ ఆంధ్ర సీఈవో రాజు చామర్తి, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, పలువురు ప్రముఖ సాహితీ వేత్తలు తదితరులు పాల్గొన్నారు.