ట్రంప్ యూనియన్ నుంచి తప్పుకుంటున్న ప్రమీలజైపాల్
భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు ప్రమీల జైపాల్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూనియన్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వలసవాదులపై వైఖరితో పాటు చేపట్టే పథకాలు నచ్చకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రమీల తెలిపారు. 52 ఏళ్ల ప్రమీల వెంట ఫ్రెడరిక్ విల్సన్, మాక్సైన్ వాటర్స్, ఎర్ల్ బ్లూమెన్యూర్ కూడా ట్రంప్ యూనియన్ నుండి బయటకి వస్తున్నట్టు ప్రకటించారు. జనవరి 30న నిర్వహించే కార్యక్రమానికి తామంతా హాజరు కావడం లేదని, తన తోటి నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా హోదాలో ఉన్న ట్రంప్ వలసదారులతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ, వారి మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అన్నారు. హైతీ, ఆఫ్రికన్ వాసులను ఉద్దేశించిన చెత్త దేశాలు అని అన్నారని, ఆయన హుందాగా ప్రవర్తించడం లేదని ప్రమీల తెలిపారు. ట్రంప్ పరిపాలనతో ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించడం బాధాకరమన్నారు. ఆయన పాలన శైలి చాలా దారుణంగా ఉందని, అవి తమకు నచ్చడం లేదని, శాంతియుత పాలనకే తాము మొగ్గు చూపుతామని తెలిపారు. తమ ప్రాంతంలో కూడా ట్రంప్ పాలనపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అధ్యక్షుడి వ్యవహారశైలితో వలసదారుడితో పాటు అతని భార్య పిల్లలు, తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.













