భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించొచ్చు!
రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్వవస్థను కొనుగోలు చేస్తుండటంతో భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికాకే చెందిన అత్యున్నత స్థాయి దౌత్యవేత్త ఒకరు పేర్కొన్నారు. సాంకేతిక విధానాల పరంగా భారత్ వ్యూహాత్మకంగా ఉండాలని సూచించారు. అమెరికా హెచ్చరికలను పక్కనబెట్టి భారత్, 2018 అక్టోబరులో రష్యా నుంచి ఐదు ఎస్-400 యూనిట్ల ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్వవస్థల కొనుగోలుకు సంబంధింఇచ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని విలువ ఐదు బిలియన్ అమెరికన్ డాలర్లు. దీనిపై భారత్ గుర్రుగా ఉన్న అమెరికా.. కాస్టా చట్టం ప్రకారం ఆంక్షలు విధించే అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తోంది. ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి గత ఏడాది 800 మిలియన్ అమెరికన్ డాలర్లను రష్యాకు భారత్ చెల్లించింది. ఉపరితలం నుంచి గగనతలం లోని సుదీర్ఘ లక్ష్యాలను చేధించగల సామర్థ్యం ఉన్న ఎస్ 400 క్షిపణి వ్యవస్థను రష్యా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది. ఇప్పటికే కాస్టా చట్టం ప్రకారం రష్యాపై అమెరికా ఆంక్షలను విధించింది.













