శృంగార తారకు ట్రంప్ ఎంతిచ్చాడో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసలీలలు అన్నీ ఇన్నీ కావు. అమ్మాయిలంటే పడి చచ్చే ట్రంప్ గతంలో ఓ శృంగార తార వెంటపడ్డారు. ఆమె పేరు స్టెఫానీ క్లిఫోర్డ్. అమెరికాలో పేరు ఉన్న పెద్ద పోర్న్ స్టార్. ఆమెతో ఒకటి రెండు సార్లు ఆయన తన ప్రేమాయణం కొనసాగించారు. కాలిఫోర్నియాలో 2006లో లేక్ తహో గెస్ట్ హౌస్ వద్ద మూడోసారి కలిశారు. అది కూడా మెలీనియాను మూడో భార్యగా చేసుకున్న ఏడాదిలోగానే. ఈ వ్యవహారాలు చాలా సార్లు బయటకు పొక్కాయి కూడా. అయితే అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్నప్పుడు స్టెఫానీతో ఠన్ఠానాఠ్కు తనకు ఇబ్బందికరంగా మారుతుందని భయపడ్డారు. తన లాయర్ మైఖేల్ కోహెన్ ద్వారా లక్షా 30వేల డాలర్లు (దాదాపు 83 లక్షల రూపాయలు) ఆమెకు పంపి మన బంధంపై నోరెత్తవద్దు అని కోరారు. స్టెఫానీ ఆయన చెప్పినట్టే ఆయనతో సెక్స్ బంధంపై మౌనం దాల్చింది. కానీ ఈ చెల్లింపు మాత్రం బయటకు పొక్కింది. ట్రంప్ రసికత వెల గురించి వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో ఈ వివరాలున్నాయి. ఆగ్రహం చెందిన ట్రంప్ లాయర్ కోహెన్ సదరు పత్రికపై పరువునష్టం దావా వేశారు. పనిలో పనిగా స్టెఫానీ చేత కూడా నోటీసుల్పించారు.













