అసిడిటీ మందులతో మరణ ముప్పు!
అసిడిటీ, జీర్ణ సమస్యలు, కడుపు నొప్పులకు చాలా కాలం నుంచీ మందులు వేసుకుంటున్నారా? ఇవి మరణ ముప్పును 50శాతం వరకూ పెంచుతాయని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ నిపుణులు దీన్ని చేపట్టారు. అసిడిటీకి ఉపయోగించే పీపీఐ ఔషధాలను ఏడాదికిపైగా తీసుకున్న 2,75,000 మంది సమాచారాన్ని వారు విశ్లేషించారు. అన్నవాహిక క్యాన్సర్, ఇతర ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే హెచ్ 2 బ్లాకర్ ఔషధాలను తీసుకున్న 75,000 మంది సమాచారంతో దీన్ని సరిపోల్చారు. దీంతో పీపీఐ ఔషధాలు తీసుకున్నవారు వచ్చే ఐదేళ్లలో మృత్యువాతపడే ముప్పు 50శాతం వరకూ ఉంటున్నట్లు బయటపడింది. పీపీఐ ఔషధాలు చాలా సురక్షితమని కొందరు భావిస్తుంటారు. దీర్ఘకాలంలో ఇవి మూత్ర పిండాల సమస్యలకు దారితీస్తాయి. మరణముప్పునూ పెంచుతాయి అని పరిశోధకులు తెలిపారు.













