ఐసీసీకి అమెరికా బెదిరింపులు
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)పై అమెరికా బెదిరింపులకు పాల్పడింది. ఇజ్రాయిల్ యుద్ధ నేరాలపై పాలస్తీనా ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటే తగిన పరిణామాలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. అసలు పాలస్తీనాను తాము సౌర్వభౌమత్వం ఉన్న దేశంగా పరిగణించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌పై ఐసీసీకి అధికార పరిధి లేదని, ఆ దేశంపై విచారణ ప్రారంభిస్తే తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత వారం ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లి వచ్చిన పాంపియో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పాలస్తీనియన్లపై జరుగుతున్న యుద్ధ నేరాలపై విచారణ చేసేందుకు ఐసీసీ సిద్దమౌతున్న సమయంలో, అది కూడా ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లి వచ్చిన తరువాత ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.













