TANA: తానా 24వ మహాసభలకు రాజకీయ నాయకుల రాక
డిట్రాయిట్ (Detroit) లో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే తానా (TANA) 24వ ద్వైవార్షిక మహాసభలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ నాయకులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈ మహాసభలకు రావాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతోపాటు పలువురు మంత్రులను, కేంద్రమంత్రులను తానా నాయకులు ఆహ్వానించారు. ఈ మహాసభలకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, తుమ్మలనాగేశ్వరరావు, నాదెండ్ల మనోహర్, దామోదర్ రాజనర్సింహ, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్‌తోపాటు ఎంపి భరత్, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, అరిమిల్లి రాధాకృష్ణ, తంగిరాల సౌమ్య, రాము వెనిగండ్ల, సురేష్ కాకర్ల, బూర్ల రామాంజనేయులు, టిడిపి నాయకులు టిడి జనార్ధన్, బిజెపి నాయకులు పాతూరి నాగభూషణం, కెడిసిసి చైర్మన్ నెట్టెం రఘురామ్, మాజీ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు, అమరావతి బహుజన్ జెఎసి పోతుల బాలకోటయ్య, రాజకీయ విశ్లేషకులు ముప్పా అంకమ్మ చౌదరి, రాజేశ్ అప్పసాని తదితరులు వస్తున్నారు.







