ప్రధానితో సుందర్ పిచాయ్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. ఈ వర్చువల్ సమావేశంలో డేటా సెక్యూరిటీ, సమాచార గోప్యతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, రైతుల జీవన పరివర్తనం కోసం సాంకేతికత వినియోగం, ఆన్లైన్ విద్య పరిధి విస్తరణతో పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఈ విషయాన్ని ప్రకటించింది. కొవిడ్ సంక్షోభ నేపథ్యంలో కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల పనిచేసే విధానంలో వస్తున్న మార్పులు సైతం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. క్రీడలు తదితర రంగాలకు ఈ విశ్వ మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. సుందర్ పిచాయ్తో చర్చ చాలా ఫలప్రదంగా జరింగింది. చాలా అంశాలపై ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకు పిచాయ్ స్పందించారు. సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ డిజిటల్ ఇండియా లక్ష్యాలపై చాలా ఆశావహంగా ఉన్నాం. ఈ దిశగా కంపెనీ తన వంతు కృషి చేయనుంది అని ట్విట్ చేశారు.













